భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని కొల్లీజియం సిఫార్సులను యథాతధంగా ఆమోదించిన ప్రభుత్వం. కొల్లీజియం సిఫార్సు ను అంగీకరిస్తూ ఈ రోజు ఉదయం రాష్ట్రపతి ఆమోదానికి పంపిన ప్రభుత్వం. ప్రభుత్వం సిఫార్సులతో నియామకపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి. తొమ్మిది మందిలో ముగ్గురు మహిళ న్యాయమూర్తులు ఉన్నారు. కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న భవిష్యత్తులో తొలి భారత సుప్రీంకోర్టు మహిళ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది.
జస్టిస్ విక్రమ్ నాధ్ ( గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ బి.వి. నాగరత్న ( కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి), తో పాటు, సీనియర్ అడ్వకేట్ పి.ఎస్. నరసింహ భవిష్యత్తులో భారత ప్రధాన న్యాయమూర్తులు అయ్యే అవకాశం ఉంది.
నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను—-తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.ఎస్. ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాధ్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే.కే.మహేశ్వరి— సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.టి. రవికుమార్, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందరేశ్, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది, ( మహిళ న్యాయమూర్తి) పేర్లను ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ. సుప్రీం కోర్టు లో ఖాళీ గా ఉన్న మొత్తం 9 మంది న్యాయమూర్తుల నియామకాలు భర్తీ.
ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ నేతృత్వంలో మొత్తం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన కొల్లీజియం—
జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఏ.ఎమ్. ఖన్విల్కర్, జస్టిస్డి.వై. చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావు—సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం, తదనంతరం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ.
సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ పి.ఎస్. నరసింహా ను సుప్రీం కోర్టు న్యాయమూర్తి గా నియామకం కావడంతో, “బార్ అసోసియేషన్” నుంచి ఇప్పటివరకు నేరుగా న్యాయమూర్తులు గా నియామకమైన 9 మంది లో ఒకరయ్యారు. సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ పి.ఎస్. నరసింహా సంస్కృత భాష లో నిష్ణాతుడు. భారత ఇతిహాసాలలో న్యాయసూత్రాల ప్రస్తావన పై అధ్యయనం చేసిన సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ పి.ఎస్. నరసింహా.