ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేపాల్ లోని లుంబినిలో ఈ రోజు జరిగిన బుద్ద పూర్ణిమ వేడుకల్లో పాల్గొన్నారు. గౌతమ బుద్దుడి జన్మ స్థానమైన లుంబినిలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్బాతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేపాల్ ప్రధానమంత్రి భార్య అర్జు రాణా దేవ్బా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ బుద్దిస్ట్ సాంస్కృతిక వారసత్వ కేంద్రానికి ప్రధానమంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణానికి ఇండియా ఆర్థిక సహాయం చేస్తోంది. ప్రధానిహోదాలో మోడీ 2014లో బుద్దగయ నుంచి తీసుకొచ్చిన బోధి మొక్కకు నేతలు ఇద్దరు నీరు పోశారు. మౌర్య చక్రవర్తి అశోకుడు 249 శతాబ్దంలో శిలా శాసనం వద్ద జ్యోతి వెలిగించారు.
ఇందుకోసం ముందుగా ఆయన ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుశినగర్‌కు వెళ్లి అక్కడ మాయాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కుశినగర్ నుంచి ఆయన ఖాట్మండుకు బయలుదేరి వెళ్ళారు. ఈ పర్యటన సమయంలో ఇరు దేశాల మధ్య ఐదు కీలక అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. జలవిద్యుత్ ప్రాజెక్టులు, అభివృద్ధి, ఇరు దేశాల మధ్య రాకపోకలకు సంబంధించిన రవాణ, మౌలిక వసతుల కల్పనవంటి అంశాలపై ఈ పర్యటనలో చర్చించనున్నారు.
శతాబ్దాల తరబడి ఇరు దేశాల మధ్య, ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు ధృడంగా మారాయన్న ఆయన వాటిని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ నేపాల్ లో పర్యటించటం ఇది ఐదోసారి కాగా, 2019 తరువాత ప్రధాని మోదీ నేపాల్‌లో పర్యటించడం ఇదే మొదటి సారి.
Also Read : హైదరాబాద్ లో బుద్ద పూర్ణిమ వేడుకలు