Tuesday, March 10, 2026
HomeTrending NewsPochampally ikat: ఫ్రాన్స్‌ ప్రథమ మహిళకు పోచంపల్లి ఇకత్‌ చీర

Pochampally ikat: ఫ్రాన్స్‌ ప్రథమ మహిళకు పోచంపల్లి ఇకత్‌ చీర

తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపిస్తున్నది. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రథమ మహిళకు చేతితో నేసిన పోచంపల్లి ఇకత్‌ చీరను బహూకరించారు. ప్రధాని మోదీ రెండు రోజుల ఫ్రాన్స్‌ పర్యటన నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌కు గంధపు చెక్కతో తయారు చేసిన సగీత వాయిద్యం సితార్, సరస్వతి విగ్రహాలు, ఆయన సతీమణి బ్రిగిట్టే మాక్రాన్‌కు చందనం పెట్టెలో పోచంపల్లి ఇకత్‌ చీరను ప్రధాని మోదీ అందజేశారు.

అదేవిధంగా ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేల్ బ్రౌన్-పివెట్‌కు చేతితో అల్లిన పట్టు కశ్మీరీ కార్పెట్‌ను, ఫ్రెంచ్ సెనేట్ ప్రెసిడెంట్ గెరార్డ్ లార్చర్‌కు గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు అంబారీని మోదీ బహూకరించారు. ఇక 20వ శతాబ్దంలో ఫ్రెంచ్ సాహిత్యంలోని ముఖ్యమైన నవలను మోదీకి మాక్రాన్ బహుమతిగా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular