Thursday, September 19, 2024
HomeTrending NewsINDIA Alliance: ఇండియా కూటమిపై ప్రధాని తీవ్ర విమర్శలు

INDIA Alliance: ఇండియా కూటమిపై ప్రధాని తీవ్ర విమర్శలు

పార్లమెంట్‌లో విపక్షాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిపక్షాలను ఎప్పుడూ చూడలేదన్నారు ప్రధాని. దిశ దశ లేని ప్రతిపక్షాలను ఇప్పటివరకు చూడలేదన్నారు. ఇక విపక్ష కూటమి పేరుపై కూడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన ఒరిగేదేమీ లేదన్నారు. ఇండియన్ నిజాముద్దీన్, PFI లాంటి ఉగ్రవాద సంస్థల పేర్లలో కూడా ఇండియా ఉందని.. విపక్షాలు ఇండియా అని పేరు పెట్టినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని అనుకోవడం అపోహ అని కామెంట్ చేశారు. ఇంత‌గా దిశ‌లేని విప‌క్షాన్ని ఎప్పుడూ చూడ‌లేద‌ని ప్ర‌ధాని మోదీ ఇవాళ జ‌రిగిన బీజేపీ భేటీలో పేర్కొన్నార‌ని సీనియ‌ర్ నేత ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ తెలిపారు.

విప‌క్ష పార్టీలు దిశానిర్దేశం లేకుండా ఉన్నాయ‌న్నారు. ఇండియ‌న్ ముజాహిద్దిన్‌, పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థ‌ల్లోనూ ఇండియా పేరు ఉంద‌ని మోదీ ఆరోపించారు. ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్‌, ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి పార్టీల‌ను కూడా విదేశీయులు ప్రారంభించిన‌ట్లు ప్ర‌ధాని మోడీ విమ‌ర్శించారు. దేశం పేరును వాడుకుని ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించ‌లేర‌ని ప్ర‌ధాని ఆరోపించారు. ఓడిపోయి, అల‌సిపోయి, ఆశ‌లేని పార్టీలుగా విప‌క్షాలు మిగిలిపోయిన‌ట్లు ప్ర‌ధాని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్