Saturday, March 14, 2026
HomeTrending Newsటోక్యోలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

టోక్యోలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు సోమవారం జపాన్ రాజధాని టోక్యో నగరానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రవాసభారతీయులు బ్రహ్మరథం పట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వచ్చిన నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. టోక్యోలో మోదీ బస చేసిన హోటల్ న్యూ ఒటానీలో భారతీయ ప్రవాసుల నుంచి ఘనస్వాగతం లభించింది.‘‘హర్ హర్ మోదీ’’, ‘‘మోదీ మోదీ’’, వందేమాతరం, భారత్ మాతా కీ జై నినాదాలు హోటల్ వద్ద ప్రతిధ్వనించాయి, ప్రవాస భారతీయులు ప్రధానమంత్రిని చూసి జాతీయ జెండాలు ఊపారు. ప్రధాని రాక సందర్భంగా చిన్నారులు సైతం చేతులు ఊపుతూ పాల్గొన్నారు. పిల్లలు వివిధ భాషల్లో స్వాగతం అని రాసిన ప్లకార్డులను పట్టుకుని కనిపించారు.

ప్రధాని జపాన్ పర్యటన సందర్భంగా ప్రవాస భారతీయులు సంతోషం వ్యక్తం చేశారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు మే 24న క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ టోక్యో చేరుకున్నారు. టోక్యోలో దిగిన తర్వాత ‘‘టోక్యోలో ల్యాండ్ అయ్యాను. ఈ పర్యటనలో క్వాడ్ సమ్మిట్, తోటి క్వాడ్ నేతలను కలవడం, జపాన్ వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సంభాషించడం వంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాను’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి మోదీ సోమవారం ఎన్ఈసీ కార్పొరేషన్ చైర్మన్ నోబుహిరో ఎండో,  సీఈవో తదాషి యానై, సుజుకి మోటార్ కార్పొరేషన్ సలహాదారు ఒసాము సుజుకీ, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్‌లో బోర్డు డైరెక్టర్ మసయోషి సన్‌లతో సమావేశం కానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular