Monday, June 15, 2026
HomeTrending Newsతెలంగాణలో ప్రధాని పర్యటన ఖరారు

తెలంగాణలో ప్రధాని పర్యటన ఖరారు

తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారయ్యింది.  ఫిబ్రవరి 13న మోడీ హైదరాబాద్ కు రానున్నారు.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు.

వాస్తవానికి సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ట్రయిన్ ను ప్రారంభించడానికి ఈ నెల 19నే మోడీ  తెలంగాణలో పర్యటించాల్సింది.  అనివార్య కారణాలవల్ల టూర్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో అనుకున్న టైం కంటే ముందే ఈ నెల 15న సికింద్రాబాద్- వైజాగ్ వందేభారత్ ట్రయిన్ ను మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో ఇపుడు మోడీ టూర్ ఖరారయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular