Saturday, January 18, 2025
Homeసినిమారామ్ & బోయపాటి మూవీలో విలన్ గా ప్రిన్స్

రామ్ & బోయపాటి మూవీలో విలన్ గా ప్రిన్స్

తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరో ప్రిన్స్. ‘బస్ స్టాప్’, ‘నేను శైలజ’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రిన్స్ రామ్, బోయపాటి శ్రీను.సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అఖండ బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి శ్రీను రామ్ తో భారీ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రిన్స్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడనే వార్త బయటకు వచ్చినప్పటి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. పవర్ ఫుల్ విలనిజాన్ని తెర మీద చూపించడంలో దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఒక డిఫరెంట్ కు ఇమేజ్ ఉంది.

ఇప్పుడు రామ్ & బోయపాటి సినిమాలో ప్రిన్స్ రోల్ సినిమాకు హైలెట్ కానుందని తెలుస్తోంది. ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ను ప్రిన్స్ కోసం బోయపాటి శ్రీను రాసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. రామ్ క్యారెక్టర్ అలాగే ప్రిన్స్ క్యారెక్టర్ నువ్వా..? నేనా..? అన్నట్టు పోటీపడేలా ఉంటాయట. ఇంకా చెప్పాలంటే.. ఇస్మార్ట్ శంకర్ మూవీతో రామ్ కు మాస్ లో మాంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ను మరింతగా పెంచేలా ఈ సినిమా ఉంటుంది అంటున్నారు సినీజనాలు. బోయపాటి జగపతి, ఆది పినిశెట్టి, శ్రీకాంత్ లను పవర్ ఫుల్ విలన్స్ మార్చారు. ఇప్పుడు ప్రిన్స్ ని విలన్ గా మార్చబోతున్నారు. మరి.. ఈ మూవీ ప్రిన్స్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి.

Also Read : రామ్ తో బోయపాటి పొలిటికల్ మూవీనా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్