Friday, March 29, 2024
HomeTrending Newsభారతదేశపు మొట్టమొదటి మొబిలిటీ ఫోకస్డ్ క్లస్టర్‌

భారతదేశపు మొట్టమొదటి మొబిలిటీ ఫోకస్డ్ క్లస్టర్‌

హైదరాబాద్ ఇ-మొబిలిటీ వీక్‌లో భాగంగా నిర్వహిస్తున్న మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ మొదటి ఎడిషన్‌లో తెలంగాణ మొబిలిటీ-ఫోకస్డ్ క్లస్టర్, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (TMV)ని తెలంగాణ ఈరోజు ప్రకటించింది. తెలంగాణ మొబిలిటీ వ్యాలిని ప్రకటించిన అనంతరం మంత్రి కే. తారక రామారావు ప్రసంగించారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఉత్తమమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని, భారతదేశంలో తయారీ మరియు R&D లో తెలంగాణను అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుస్తుందన్న నమ్మకాన్ని అయన వ్యక్తం చేశారు.

“TMV సుమారు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి, రాబోయే 5 సంవత్సరాలలో 4 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందనీ, దీని కోసం, రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల 4 మెగా క్లస్టర్‌లను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. జహీరాబాద్‌లో EV మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, సీతారాంపూర్‌లో EV మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (ESS) క్లస్టర్ మరియు యెంకతల వద్ద ఇన్నోవేషన్ క్లస్టర్ అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి క్లస్టర్‌ అత్యాధునిక మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుందని మంత్రి తెలిపారు. “3,000 కోట్లకు పైగా పెట్టుబడులను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయని, వాటి వివరాలను రాబోయే 2 వారాల్లో అందజేస్తామని తెలిపారు. ఈ పెట్టుబడులు తెలంగాణలో ఎలక్ట్రిక్ 3-వీలర్, ఎలక్ట్రిక్ 2-వీలర్ మరియు ఛార్జింగ్ పరికరాల తయారీ ఏకో సిస్టమ్ ను మరింత బలోపేతం చేస్తాయన్నారు. “ ఎలక్ట్రిక్ 2 వీలర్స్/ 3 వీలర్స్/ 4 వీలర్స్, అడ్వాన్స్‌డ్ సెల్ కెమిస్ట్రీ మరియు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్, టైర్ 1 మరియు టైర్ 2 కాంపోనెంట్ తయారీదారులు మరియు ఆటో ఇంజినీరింగ్ R&D రంగాల్లో ఆయా కంపెనీల కార్యకలాపాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ మొబిలిటీ ర్యాలీ పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఈ రంగం లోని నిపుణులు మరియు గ్లోబల్ ఆటోమోటివ్ ఎకోసిస్టమ్ భాగస్వాములను ఒకచోట చేర్చడం కోసం హైదరాబాద్ ఇ-మొబిలిటీ వీక్ క్రమం తప్పకుండా నిర్వహించబడుతుందని కేటీఆర్ చెప్పారు.

ఈరోజు జరిగిన కార్యక్రమంలో భాగంగా మూడు అవగాహన ఒప్పందాలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వంతో ATS-TUV రైన్‌ల్యాండ్ ఎంఓయూ, బిట్స్ హైదరాబాద్‌తో బోష్ Bosch గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ అవగాహన ఒప్పందం, షెల్‌తో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.

అపోలో టైర్స్ లిమిటెడ్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ హిజ్మీ హాసెన్ కీలకోపన్యాసం చేస్తూ, “తెలంగాణ ప్రభుత్వం ఇతర పెట్టుబడులతో ఆటోమోటివ్ పరిశ్రమకు ప్రాధాన్యతను ఇస్తూ, ఇ-మొబిలిటీ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అన్నారు. ఇ-మొబిలిటీ తో పాటు పర్యావరణ అనుకూల అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఆటోమోటివ్ పరిశ్రమ ఇలాంటి ప్రోత్సాహకాలు, అద్భుతమైన మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వంలోని పాలసీ రూపకర్తలు మరియు పరిశ్రమలోని ఇతర భాగస్వాములు కలిసి నడవాల్సిన అవసరం ఉందన్నారు.

వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఇండియా, సేల్స్, మార్కెటింగ్ & డిజిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రిస్టియన్ కాహ్న్ వాన్ సీలెన్, ఈ- మొబిలిటీ యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, “భారత్‌లోని ప్రభుత్వ విధానాలతో సహా ఈ పరిశ్రమలో ఉన్న అందరూ భాగస్వాముల మధ్య సరైన సహకారం ద్వారానే ప్రగతి సాధించవచ్చన్నారు. భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ ఈ విషయంలో ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుందనీ, వాతావరణ మార్పు వలన ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడానికి ఆటోమొబైల్ పరిశ్రమ ప్రభుత్వాలతో కలిసి ముందుకు నడిచేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు.

ఈ సమ్మిట్‌లో కమల్ బాలి, వోల్వో గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ మరియు MD, నికోలస్ లాంగ్, సీనియర్ పార్టనర్ & MD, గ్లోబల్ లీడర్- గ్లోబల్ అడ్వాంటేజ్ ప్రాక్టీస్, BCG, ప్రభ్‌జీత్ సింగ్, ఉబెర్ ఇండియా & సౌత్ ప్రెసిడెంట్‌తో సహా ప్రభుత్వం, విద్యాసంస్థలు మరియు పరిశ్రమల నుండి భాగస్వామ్యం జరిగింది. ఆసియా, శ్రీకాంత్ సిన్హా, CEO, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ – టాస్క్, సుమన్ మిశ్రా, CEO, మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ డివిజన్, డిర్క్ ఆడమ్‌జిక్, SVP, ఇంజినీరింగ్ సొల్యూషన్స్ ZF ఫ్రెడ్రిచ్‌షాఫెన్ AG, మమతా చమర్తి, SVP బిజినెస్ & ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, SVP బిజినెస్ & ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్, డాక్టర్ అమరేష్ చక్రబర్తి, సెంటర్ ఫర్ ప్రొడక్ట్ డిజైన్ & మాన్యుఫ్యాక్చరింగ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, పాల్గొన్నారు. ఉన్నారు.

మరింత సమాచారం కోసం….

మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ 2023 లో నమోదు చేసుకోవడానికి, ఈవెంట్ వెబ్‌సైట్‌ని https://www.evhyderabad.in/mobility-nextలో సందర్శించండి.

Also Read : 16 వేల కోట్లతో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్