Sunday, September 29, 2024
Homeసినిమా'లైగర్'తో ప్రియా ప్ర‌కాష్ స్పెష‌ల్ సాంగ్?

‘లైగర్’తో ప్రియా ప్ర‌కాష్ స్పెష‌ల్ సాంగ్?

Special Song? సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ లైగ‌ర్. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టిస్తోంది. పూరి, ఛార్మి, క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తోన్న లైగ‌ర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఈ భారీ స్పోర్ట్స్ డ్రామాను ఆగ‌ష్టు 25న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలాఉంటే ఈ సినిమాలో యుంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ మ‌ధ్య పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ప్రియా ప్రకాష్ వారియర్ ని సంప్రదించారట. దీంతో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సాధించిన ప్రియా ప్రకాష్ వారియర్ నిజంగానే లైగర్ లో స్పెషల్ సాంగ్ చేయ‌నుందా అని ఆస‌క్తిగా మారింది కానీ.. లైగ‌ర్ టీమ్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. మ‌రి.. త్వ‌ర‌లో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్