Tuesday, June 16, 2026
Homeసినిమాసాయి తేజ్ తో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని ఉంది: కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్

సాయి తేజ్ తో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని ఉంది: కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ ‘బ్రో’. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్ అయితే.. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ నెల 28న బ్రో మూవీ భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. అభిమానుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ మెగా ఈవెంట్ లో మెగా కుటుంబం సందడి చేసింది.

కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్ మాట్లాడుతూ.. “నాపై నమ్మకం ఉంచి నన్ను ఈ పాత్రకు ఎంపిక చేసినందుకు సముద్రఖని గారికి ధన్యవాదాలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇచ్చిన మద్దతుని, ప్రోత్సాహాన్ని మర్చిపోలేను. థమన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. నాలాంటి నూతన నటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటించే అవకాశం రావడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన నాలో స్ఫూర్తి నింపారు. సాయి ధరమ్ తేజ్ తో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. తేజ్ తో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని ఉంది.” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular