Monday, June 15, 2026
Homeసినిమా'భామాకలాపం 2' స్ట్రీమింగ్ ఆ రోజునే!

‘భామాకలాపం 2’ స్ట్రీమింగ్ ఆ రోజునే!

‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఆ మధ్య వచ్చిన ‘భామాకలాపం’ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాపినీడు – సుధీర్ ఈదర నిర్మించిన ఈ సినిమాకి, అభిమన్యు దర్శకత్వం వహించాడు. ప్రియమణి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, కామెడీని .. క్రైమ్ థ్రిల్లర్ ను కలుపుకుంటూ ఫ్యామిలీ డ్రామాలా సాగుతుంది. ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో, ‘భామా కలాపం 2’ పేరుతో సెకండ్ పార్టును రూపొందించారు.

‘భామా కలాపం 2’ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో అనుపమ పాత్రను  ప్రియమణి పోషించింది. అపార్టుమెంటులో ఎవరెవరు ఏం చేస్తున్నారనే విషయాలను తెలుసుకోవడం పట్ల ఆమెకి ఆసక్తి ఎక్కువ. ఇతరుల విషయాలనీ .. లోగుట్టును తెలుసుకోవడంలో ఆమె ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. అదే ఆమె ఓ మర్డర్ కేసులో ఇరుక్కోవడానికి కారణమవుతుంది.

అనుపమ తాను మర్డర్ చేసిన వ్యక్తి డెడ్ బాడీని, తన పని మనిషి శిల్ప సాయంతో వదిలించుకోవడానికి చేసే ప్రయత్నాలతో ఫస్టు పార్టు నడుస్తుంది. ఇకపై ఇతరుల కుటుంబ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయనని భర్తకు మాట ఇవ్వడంతో సెకండ్ పార్టు మొదలుకానుంది. అయితే ఆమె ఆ మాట నిలబెట్టుకుంటే కథనే ఉండదు గనుక, ఆమె ఆ ప్రతిజ్ఞను పక్కన పెడుతుందనే అనుకోవాలి. ఫలితంగా ఆమెకి ఎదురయ్యే పరిస్థితులను సెకండ్ పార్టులో చూస్తూ సరదాగా నవ్వుకోవచ్చన్న మాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular