1.2 C
New York
Tuesday, November 28, 2023

Buy now

Homeసినిమాప్రియాంక అరుళ్ మోహన్ జోరు పెరుగుతున్నట్టే! 

ప్రియాంక అరుళ్ మోహన్ జోరు పెరుగుతున్నట్టే! 

స్టార్ హీరోల సరసన చేయాలనే ఉద్దేశంతోనే కథానాయికలంతా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. ఆరంభంలో ఒక మాదిరి హీరోలతో తమ కెరియర్ ను మొదలుపెట్టినప్పటికీ, స్టార్ హీరోల జోడీగా ఛాన్స్ దక్కే సమయం కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే అలాంటి అవకాశం కొంతమందికి వెంటనే లభిస్తే, మరికొంతమందికి చాలా సమయం పడుతుంది. కెరియర్ ఆరంభంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ ను అందుకున్న కథానాయికలను అదృష్టవంతులనే అంటారు.

అలాంటి అదృష్టవంతుల జాబితాలో ప్రియాంక అరుళ్ మోహన్ ఒకరుగా కనిపిస్తుంది. 2019లో ఒక కన్నడ సినిమా ద్వారా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే ఆమె తెలుగులో నాని సరసన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ .. శర్వానంద్ జోడీగా ‘శ్రీకారం’ చేసే అవకాశాలను అందుకుంది. టాలీవుడ్ లో ఈ ఇద్దరి హీరోలకి మంచి క్రేజ్ ఉందనే సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అయితే ఆ సినిమాలు అఆశించిన స్థాయిని అందుకోలేకపోవడంతో, ప్రియాంకను గురించి ఎవరూ పెద్దగా ఆలోచన చేయలేదు.

అయితే ఆడియన్స్ వైపు నుంచి నాజూకు సుందరిగా మంచి మార్కులు తెచ్చుకుంది. -పెద్దగా ఆలస్యం చేయకుండా కోలీవుడ్ దిశగా అడుగులు వేసింది. శివ కార్తికేయన్ .. సూర్య వంటి స్టార్ హీరోలతో చేయడమే కాకుండా సక్సెస్ లను అందుకుంది. దాంతో తెలుగులో ‘సరిపోదా శనివారం’తో  నాని సరసన మరోసారి అవకాశాన్ని దక్కించుకుంది. అలాగే తమిళంలో జయం రవి జోడీగా ఒక సినిమా చేస్తోంది. ఇక తెలుగులో పవన్ సరసన నాయికగా ‘OG’కి ఎంపిక కావడమే కాకుండా, తమిళంలో విజయ్ – వెంకట్ ప్రభు కాంబోలోను అవకాశం వరించింది.  దాంతో టాలీవుడ్ లోని మిగతా స్టార్ హీరోల సినిమాల నుంచి కూడా అమ్మడికి ఆఫర్లు వస్తున్నట్టుగా వినికిడి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్