ఎన్టీఆర్ మూవీలో ప్రియాంకా చోప్రా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘దేవర’ అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంటే.. విలన్ గా హీరో సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో ఇటీవల ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. ఎన్టీఆర్ సమ్మర్ వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత తాజా షెడ్యూల్ హైదరాబాద్లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జంటగా దీపికా పడుకునే నటించనున్నట్టుగా టాక్ వచ్చింది.ఇప్పుడు ప్రియాంకా చోప్రా పేరు వినిపిస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సినిమాకి సంబంధించి నటీనటుల ఎంపిక జరగలేదట. కాకపోతే.. ఇందులో హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉండడంతో ప్రియాంకా చోప్రా అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారని సమాచారం. మరి.. ఎన్టీఆర్ సరసన దీపికా నటించనుందో.. ప్రియాంకా నటించనుందో..? క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *