Thursday, April 3, 2025
Homeస్పోర్ట్స్Orléans Masters-2023: పురుషుల సింగిల్స్ విజేత రజావత్

Orléans Masters-2023: పురుషుల సింగిల్స్ విజేత రజావత్

భారత షట్లర్ ప్రియాన్షు రజావత్ : ఫ్రాన్స్ లో జరుగుతోన్న ఓర్లీన్స్ టోర్నమెంట్ లో పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. నేడు జరిగిన ఫైనల్లో డెన్మార్క్ ప్లేయర్ మాగ్నస్ జోనాసేన్ పై 21-15; 19-21; 21-16 తేడాతో విజయం సాధించి తన కెరీర్ లో మొదటి BWF టైటిల్ దక్కించుకున్నాడు.

నిన్న జరిగిన సెమి ఫైనల్లో ఐరిష్ ప్లేయర్ హాట్ యెన్ గుయెన్ పై 21-12;21-9 తేడాతో విజయం సాధించి టైటిల్ రేసులో నిలిచాడు.

రజావత్ 2022 లో  బాంకాక్ లో జరిగిన థామస్ కప్ లో పురుషుల టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. 2022 లో జరిగిన ఓడిషా ఓపెన్ లో  రన్నరప్ గా నిలిచాడు.

ఓర్లీన్స్ టోర్నమెంట్ లో భారత ఆటగాళ్ళు రజావత్ ఫైనల్స్ కు చేరుకొని విజయం సాధించగా, పురుషుల డబుల్స్ లో ఎమ్మార్ రాజు, ధృవ్ కపిల క్వార్టర్స్ లో వెనుదిరిగారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్