Monday, March 16, 2026
Homeస్పోర్ట్స్Orléans Masters-2023: ఫైనల్లో రజావత్

Orléans Masters-2023: ఫైనల్లో రజావత్

 ఫ్రాన్స్ లో జరుగుతోన్న ఓర్లీన్స్ టోర్నమెంట్ లో భారత షట్లర్ ప్రియాన్షు రజావత్ ఫైనల్లో ప్రవేశించాడు. నేడు జరిగిన పురుషుల సింగిల్స్ సెమి ఫైనల్లో ఐరిష్ ప్లేయర్ హాట్ యెన్ గుయెన్ పై 21-12;21-9 తేడాతో విజయం సాధించాడు.

రేపు జరిగే ఫైనల్లో డెన్మార్క్ ప్లేయర్ మాగ్నస్ జోనాసేన్ తో రజావత్ తలపడనున్నాడు.

రజావత్ 2022 లో  బాంకాక్ లో జరిగిన థామస్ కప్ లో పురుషుల టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. 2022 లో జరిగిన ఓడిషా ఓపెన్ లో  రన్నరప్ గా నిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular