Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో తెలుగు టైటాన్స్ కు అదృష్టం కలిసి రావడం లేదు. ఒకటి రెండు పాయింట్ల తేడాతో ఓటమి పాలవుతోంది. చివరి మ్యాచ్ లో పునేరి పై ఒక పాయింట్ తేడాతో ఓటమి పాలైన ఈ జట్టు నేడు హర్యానా చేతిలో రెండు పాయింట్లతో మ్యాచ్ చేజార్చుకుంది.
నేడు జరిగిన రెండు మ్యాచ్ ల్లో పాట్నా, హర్యానా జట్లు విజయం సాధించాయి.
పాట్నా పైరేట్స్ – పునేరి పల్టాన్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో పాట్నా 38-26 తేడాతో ఘనవిజయం సాధించింది. ఫస్ట్ హాఫ్ లో రెండు జట్లూ చెరో 14పాయింట్లు సాధించి సమంగా నిలిచాయి. అయితే రెండో అర్ధ భాగంలో పాట్నా సత్తా చాటింది. 24-12తో దూసుకుపోయింది. పాట్నా ఆటగాడు సచిన్ పది రైడ్ పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తెలుగు టైటాన్స్ – హర్యానా స్టీలర్స్ మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో హర్యానా 37-39 తో విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో హర్యానా 23-19 తో నాలుగు పాయిట్ల ఆధిక్యం సంపాదించింది. ద్వితీయార్ధంలో తెలుగు టైటాన్స్ 18-16తో ఆధిక్యం సంపాదించినా రెండు పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది.
Also Read : ప్రొ కబడ్డీ: తెలుగు టైటాన్స్ కు నిరాశ