అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప 2’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. యూట్యూబ్ ని షేక్ చేసింది. తక్కువ టైమ్ లోనే పుష్ప 2 గ్లింప్స్ 100 మిలియన్ వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో పుష్ప 2 పై ఎంత క్రేజ్ ఉందో అర్ధం అయ్యింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ లేదా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారని సమాచారం.

అయితే.. ఇటీవల అల్లు అర్జున్.. సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు. అలాగే త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తోన్న ‘జవాన్’ మూవీలో ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడని కూడా టాక్ వినిపించింది. అలాగే బాలీవుడ్ మైథాలజీ మూవీ The Immortal Ashwatthama లోనూ బన్నీ నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది.

తాజాగా వీటి గురించి బన్నీ సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. బన్నీ త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. దీన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ సినిమా ఫుల్ ఆఫ్ యాక్షన్తో ఉంటుందని చెప్పారు. అలాగే జవాన్ మూవీలో బన్నీ ఎలాంటి రోల్ చేయట్లేదు అని క్లారిటీ ఇచ్చారు. ‘The Immortal Ashwatthama యూనిట్ వాళ్లు ఓ పాత్ర కోసం బన్నీని సంప్రదించిన మాట వాస్తవమే. కానీ ఆయన దీని పై ఎలాంటి నిర్ణయాన్ని వాళ్లకు చెప్పలేదు అన్నారు. బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ ఇచ్చారు బన్నీ వాస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *