Monday, June 15, 2026
Homeసినిమాఏఎంబి మాల్ లో ‘పాయిజన్’ ట్రైలర్ లాంచ్

ఏఎంబి మాల్ లో ‘పాయిజన్’ ట్రైలర్ లాంచ్

Trailer of Poison:
ర‌మ‌ణ హీరోగా ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘పాయిజ‌న్’. ఈ చిత్రాన్ని సిఎల్ఎన్ మీడియా బ్యాన‌ర్ పై శిల్పిక నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాష‌ల్లో రూపొందిన ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఏఎంబి మాల్ లో ఈ పాయిజ‌న్ మూవీ ట్రైల‌ర్ ను లాంచ్ చేశారు. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ సి.క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.

కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. నాకు ఈ ప్రొడ్యూసర్స్ బాగా తెలుసు. సినిమా అంటే ప్రాణం పెడతారు. చాలా రిచ్ గా తీశారు. హీరో రమణకు మంచి భవిష్యత్తు ఉంది. డైరెక్టర్ రవిచంద్రన్ మా కాంపౌండ్ వాడు. మంచి టాలెంటెడ్.. ట్రైలర్ లోనే తన ప్రతిభను చూపించాడు. యూత్ అంతా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారనే దానిలో సందేహం లేదు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది” అన్నారు.

నిర్మాత పుప్పాల రమేష్ మాట్లాడుతూ “హీరో రమణ త‌న క్యారెక్ట‌ర్ కు త‌గ్గ‌ట్టుగా మంచి ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. హీరోకు కావలసింది అదే..రమణ వాయిస్ చాలా బాగుంది. మన సినిమా పరిశ్రమకు ఇంకొక హీరో దొరికాడు. డైరెక్టర్ కు డైరెక్షన్ మీద ఉన్న‌ మంచి పట్టు కనబడుతుంది. ట్రైలర్ కట్ చేసిన విధానం బాగుంది, ‘పాయిజన్’ మూవీ టీంకు ఆల్ ద బెస్ట్” అన్నారు.

చిత్ర దర్శకుడు రవిచంద్రన్ మాట్లాడుతూ “ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషనేట్ ఉన్నవారు. నేను ఏది అడిగితే అది సమకూర్చారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. హీరో రమణ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. నిమిషాల్లోనే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాడు. తను తప్పకుండా మంచి హీరో అవుతాడు” అన్నారు.

Also Read : ఆద్యంతం భావోద్వేగంతో ‘ఆర్ఆర్ఆర్’ జనని సాంగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular