మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గెస్ట్ రోల్ చేయడం విశేషం. అందాల తార నయనతార, టాలెంటెడ్ ఆర్టిస్ట్ సత్యదేవ్ ముఖ్యపాత్రలు పోషించారు. ఆమధ్య రిలీజ్ చేసిన గాడ్ ఫాదర్ టీజర్ అనూహ్యమైన స్పందన రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
అయితే.. అదే డేట్ కి నాగార్జున ది ఘోస్ట్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ లో దూసుకెళుతుంది. అందుచేత ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమా దసరా రేసు నుంచి తప్పుకుంటుంది అని ప్రచారం జరిగింది. ఇప్పుడు గాడ్ ఫాదర్ వాయిదాపడిందని.. డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపించింది. ఈ వార్తలు ఊపందుకోవడంతో గాడ్ ఫాదర్ ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.
ఇంతకీ ఏం చెప్పారంటే.. అసలు ఇలాంటి వార్తలను ఎవరు క్రియేట్ చేస్తారో తెలియదు. ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదు. గాడ్ ఫాదర్ మూవీ ముందుగా ప్రకటించినట్టుగానే దసరా కానుకగా అక్టోబర్ 5న వస్తుందని అనౌన్స్ చేశారు. సో.. దసరాకి గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ మధ్య పోటీతప్పదన్న మాట. మరి.. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి.
Also Read : తక్కువ థియేటర్లలో ‘గాడ్ ఫాదర్’?