Sunday, January 19, 2025
HomeసినిమాBoys Hostel: ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చిన చిత్రం 'బాయ్స్ హాస్టల్' - సుప్రియ

Boys Hostel: ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చిన చిత్రం ‘బాయ్స్ హాస్టల్’ – సుప్రియ

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరేను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో గ్రాండ్ గా విడుదల చేశాయి. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఇందులో ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించగా, రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రల్లో నటించారు. బాయ్స్ హాస్టల్ ఆగస్టు 26న తెలుగులో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ‘స్టూడెంట్ ఫిల్మ్ అఫ్ ది ఇయర్’ గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

సక్సెస్ మీట్ లో నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఎక్కడున్నా ఆదరించడం తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకత. ‘బాయ్స్ హాస్టల్ ’ చిత్రంతో అది మరోసారి రుజువయింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చిన చిత్రం బాయ్స్ హాస్టల్. థియేటర్ లో ప్రేక్షకుల నవ్వులు చూస్తున్నపుడు వచ్చే తృప్తి వేరు. అలాంటి గొప్ప తృప్తి, మజాని ఇచ్చిన చిత్రమిది. నాగార్జున గారు ఈ సినిమా చేస్తున్నపుడు ఏ జోనర్ సినిమా అని అడిగారు. ఏం చెప్పాలో కాసేపు  ఆలోచించాను.( నవ్వుతూ). ఎందుకంటే ఇది చాలా కొత్త తరహా చిత్రం. నాగర్జున గారు ఈ సినిమా చూసి.. ‘చాలా యూనిక్ గా వుంది కదా’ అన్నారు. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు మాకు కూడా కొత్తకొత్తగా ఆలోచనలు పుడతాయి. సినిమాని థియేటర్ లో చూడండి. తప్పకుండా మిమ్మల్ని నవ్విస్తుంది. ఇది మా గ్యారెంటీ’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్