Intro Adurs: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ప్రాజెక్ట్ కే. ఈ చిత్రానికి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రసిద్ద నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో.. ఎప్పుడెప్పుడు ప్రాజెక్ట్ కే గురించి అప్ డేట్స్ వస్తాయా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తాజాగా ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా గురించి అప్ డేట్ ఇచ్చాడు. “ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తి చేశాం. ప్రభాస్ ఇంట్రో సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ సీన్ అయితే అదిరింది. సినిమాలో ఆయన లుక్ చాలా కూల్ గా ఉంటుంది. జూన్ నుంచి నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నాం.. అంతే కాకుండా… ఈ సినిమా కోసం అందరం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం” అని తెలియచేశారు.
దీంతో ప్రభాస్ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. రాధేశ్యామ్ ప్లాప్ అవ్వడంతో ప్రభాస్ అభిమానుల ఆశలు అన్నీ సలార్, ప్రాజెక్ట్ కే పైనే ఉన్నాయి. ప్రాజెక్ట్ కేలో ఇంట్రో సీన్ అదిరిపోయిందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పడంతో ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీంతో ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా..? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ విడుదలకు చాలా టైమ్ ఉంది కాబట్టి ఫస్ట్ లుక్ రిలీజ్ కి చాలా టైమ్ పట్టచ్చు.
Also Read : ప్రభాస్ స్పిరిట్ మూవీలో కైరా.. ఇది నిజమేనా?