Friday, November 22, 2024
HomeTrending NewsTDP: బాబుకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత

TDP: బాబుకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థతి ఆందోళనకరంగా ఉందని, వెంటనే ఆయన్ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాలని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ విషయమై న్యాయపోరాటం కూడా చేస్తామని స్పష్టం చేశారు. బాబు ఐదు కిలోల బరువు తగ్గారన్న సమాచారం తమ వద్ద ఉందని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారులు సరైన నివేదికలు, ముఖ్యమైన టెస్టుల రిపోర్టులు కూడా ఇవ్వడం లేదని, డాక్టర్లపై కూడా ప్రభుత్వం ఒత్తిడి తీసుకు వస్తోందని ఆరోపించారు. బాబుకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని యనమల హెచ్చరించారు.

73 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు 23 ఏళ్ళ యువకుడిగా పనిచేస్తుంటారని… క్రమశిక్షణ, ఆరోగ్య, ఆహార అలవాట్ల వల్లే ఆయన ఇప్పటి వరకూ ఆరోగ్యంగా ఉన్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బాబుకు స్కిన్ సమస్య ఉందని, అందుకే ఏసీ సౌకర్యం ఆడించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని, డీ హైడ్రేషన్ తో బాధ పడుతున్నారని…. 33 రోజుల్లో ఐదు కిలోల బరువు తగ్గడం ఆందోళనకరమని, తాము కూడా డాక్టర్లతో కూడా మాట్లాడామని, దీని ప్రభావం శరీరంలోని మిగిలిన అవయవాలపై కూడా పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ వైద్యులపై తమకు నమ్మకం లేదని, వారిపై ఒత్తిడి తీసుకు వచ్చి తప్పుడు నివేదికలు ఇప్పిస్తున్నారని, అందుకే బాబు వ్యక్తిగత వైద్యులను జైలుకు పంపి చికిత్స అందించాలని, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్ నుంచి డాక్టర్లను పిలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్టెరాయిడ్స్, అవసరం లేని మందులు ఇప్పించి బాబు ప్రాణాలకు హాని కలిగించాలని చూస్తున్నారని అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబుకు ఏదైనా జరిగితే కర్మ, కర్త, క్రియ జగన్ మాత్రమే అని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్