1.2 C
New York
Tuesday, November 28, 2023

Buy now

HomeTrending NewsSajjala: బాబు ఒక కిలో బరువు పెరిగారు: సజ్జల

Sajjala: బాబు ఒక కిలో బరువు పెరిగారు: సజ్జల

చంద్రబాబు ఆరోగ్యంపై  తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఐదు కిలోలు బరువు తగ్గారంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారని… వాస్తవానికి ఆయన ఒక కిలో బరువు పెరిగారని తెలిసిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదైనా మాట్లాడితే జైల్లో ఉన్న వెయింగ్ మిషన్ కూడా తప్పని చెబుతారని అన్నారు. గతంలో బాబుతో ములాఖత్ కు వెళ్ళివచ్చిన వారు ఆయన ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారని  గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

స్కిన్ అలెర్జీ వస్తే దానితో ప్రాణాలకు ముప్పు అంటూ ప్రచారం చేస్తున్నారని, జైల్లో ఏసీ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని, దేశంలో ఎక్కడా అలాంటి సౌకర్యం లేదని స్పష్టం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి బాబుకంటే సీనియర్ నేతలు కూడా ఏసీ లేకుండానే జైలు శిక్ష అనుభవించారని అన్నారు. బాబు ఆరోగ్యంపై టిడిపి నేతలు సిఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి రావడం విచిత్రంగా ఉందన్నారు.

బాబుకు ఆహరం ఇంటి నుంచే వస్తోందని, అంటే దానిలో ఏమైనా కలుపుతున్నారేమో అని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. మంచి నీరు కూడా ఇంటి నుంచే వస్తుంటాయని… కానీ బాబు సతీమణి భువనేశ్వరి జైల్లో వాటర్ ట్యాంక్ సరిగా లేదని చెప్పడం సరికాదన్నారు.  అందరు ఖైదీలకు ఎలాంటి హక్కులు ఉంటాయో బాబుకూ అవే ఉంటాయన్నది గుర్తుంచుకోవాలన్నారు. బాబును రాచి రంపాన పెడుతున్నట్లు సృష్టిస్తున్నారని… వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జైలు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేసి బాబు ఆరోగ్యంపై చెబితే బాగుంటుందని సజ్జల అభిప్రాయపడ్డారు.

బాబు అరెస్టు వెనుక బిజెపి ప్రమేయం లేదన్న విషయం చెప్పేందుకే అమిత్ షా లోకేష్ ను పిలిపించినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటోందని, లోకేష్ కూడా నిన్నటి చిట్ చాట్ లో ఈ విషయం చెప్పడం విడ్డూరంగా ఉందని సజ్జల అన్నారు. బాబు కేస్ ఏ బెంచ్ లో  ఉందని అమిత్ అడిగినట్లు లోకేష్ చెప్పాడన్ని సజ్జల ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పత్రిక చైతన్య రథంలో  బాబు అరెస్టు వెనుక కేంద్రం హస్తం అంటూ ఓ వార్త కూడా రాశారని సజ్జల దాని క్లిప్పింగ్ ను మీడియాకు చూపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్