తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లను కొంతకాలంపాటు మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు షోలు వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికలు, ఎండలు, ఇతర కారణాలతో ఇటీవలి కాలంలో పెద్ద సినిమాలు విడుదల కాలేదు. దీంతో సినిమా హాళ్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. విడుదలైన చిన్న సినిమాలను మల్టీ ప్లెక్స్ లలోనే చూసేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారని, అందువల్ల సింగల్ స్క్రీన్ థియేటర్లకు కనీసం పవర్ ఖర్చులు కూడా రావడంలేదని వారు యాజమానులు వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో థియేటర్లను బంద్ చేస్తున్నట్లు ప్రకటించాయి