Saturday, November 23, 2024
HomeTrending Newsఅమెరికా అబార్షన్ తీర్పుపై నిరసనలు

అమెరికా అబార్షన్ తీర్పుపై నిరసనలు

అమెరికాలో అబార్షన్‌ హక్కుల రద్దు నిర్ణయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై 50 రాష్ట్రాల్లోనూ నిరసనలు కొనసాగుతున్న వేళ..అమెరికా మాజీ ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తదితర ప్రముఖులు తీర్పును తప్పు పట్టారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా మహిళా ఆరోగ్య ప్రాముఖ్యత తగ్గడంతో పాటు వాళ్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పలువురు ప్రముఖులు సైతం వ్యాఖ్యలు చేస్తున్నారు. తీర్పుపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. అమెరికా సుప్రీం కోర్టు తీర్పును ఆయన స్వాగతించారు.  ఇది దైవ నిర్ణయమంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యనించిన ఆయన.. కాసేపటికే ఆ క్రెడిట్‌ తనకే దక్కాలంటూ కామెంట్‌ చేశాడు.

అమెరికాలో అబార్షన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. అబార్షన్‌ నిషేధించే విషయంలో రాష్ట్రాలే ఇక నిర్ణయం తీసుకోవచ్చునని పేర్కొంది. దీంతో అబార్షన్‌ చేయించుకునేందుకు వీలుగా మహిళలకు దాదాపు 50 ఏళ్లుగా అందుబాటులో ఉన్న రాజ్యాంగపరమైన హక్కులకు ముగింపు పలికినట్లయింది. దేశవ్యాప్తంగా దాదాపు 25 రాష్ట్రాలు అబార్షన్‌పౖౖె త్వరలోనే నిషేధాజ్ఞలు విధించే అవకాశాలున్నాయి. 5-3 మెజార్టీతో వెలువడిన ఈ తీర్పుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అబార్షన్‌ విషయంలో మహిళల హక్కులను కాపాడేందుకు తన అధికారాలను ఉపయోగించుకుంటూ అవసరమైన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒక మహిళ, ఆమె డాక్టర్‌ తీసుకునే నిర్ణయంలో రాజకీయ నాయకుల జోక్యం ఎంతమాత్రమూ తగదన్నారు. సుప్రీం తీర్పుపై మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా విమర్శలు గుప్పించారు. అమెరికన్ల స్వేచ్ఛపై దాడిగా పేర్కొన్నారు.

మరో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం దీనిపై హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్‌ హయాంలో నియమితులైన ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్‌ నీల్‌ గొర్సుచ్‌, జస్టిస్‌ బ్రెట్‌ కావనాగ్‌, జస్టిస్‌ అమీ కొనే బారెట్‌ అబార్షన్‌ హక్కులకు మంగళం పాడేందుకు మద్దతు పలికారు. గర్భవిచ్ఛిత్తికి సంబంధించి అమెరికాలో ఇటీవల ఒపీనియన్‌ పోల్స్‌ నిర్వహించగా.. మెజార్టీ పౌరులు మహిళలకు ఆ విషయంలో పూర్తి హక్కులు ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికే ముప్పుందని అంచనాలు వెలువడుతున్నాయి.

Also Read : అమెరికా గన్ కల్చర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్