Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

CM Review on Education: నాడు – నేడు కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య పెరిగిందని, దీనికి అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  నాడు – నేడు మొదటి దశ, రెండో దశ తర్వాత పెరిగే సంఖ్యను పరిగణలోకి తీసుకుని అదనపు తరగతి గదులు, మౌలిక వసతులు, బోధనా సిబ్బంది నియామకంపై ఎప్పటికప్పుడు  దృష్టి పెట్టాలని సూచించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు  కార్యాలయంలో స్కూళ్ల మ్యాపింగ్, జగనన్న విద్యాకానుక, నాడు –నేడు రెండో దశ, గోరుముద్ద, సంపూర్ణ పోషణ,  టాయిలెట్ల నిర్వహణ,  స్వేచ్ఛ తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. వాటిలో ముఖ్యాంశాలు:

⦿ నూతన విద్యావిధానం ప్రకారం ఆరు రకాల స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నాం, ఇప్పటికే కొన్నింటిని నెలకొల్పాము
⦿ మిగిలిన స్కూళ్ల మ్యాపింగ్‌పై దృష్టిపెట్టాలి, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలి
⦿ సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయలు, ఇతర సిబ్బందిని నియమించాలి
⦿ సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బంది ఉండాలని స్పష్టంచేశాం
⦿ ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు తీసుకుని సమర్థవంతంగా అమలు చేయాలి
⦿ పిల్లలకు మంచి చేసేందుకు తీసుకున్న నిర్ణయాలను వారికి వివరించి వారి భాగస్వామ్యాన్ని తీసుకోవాలి
⦿ ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తే వారిని కూడా పరిగణలోకి తీసుకుని వారి సూచనలతో ముందుకెళ్లాలి
⦿ ఇంగ్లిషులో పరిజ్ఞానం కోసం ఉద్దేశించిన యాప్స్‌ ను బాగా వినియోగించుకునేలా చూడాలి
⦿ జిల్లా అధికారులు నిరంతరం స్కూళ్లను పర్యవేక్షించాలి
⦿ గోరుముద్ద నాణ్యత పరిశీలన కొనసాగాలి
⦿ వసతుల్లో, నిర్వహణలో లోపాలు ఉంటే వెంటనే నమోదుచేసి వాటిని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలి
⦿ గోరుముద్ద కింద ఇంకా కొత్త వంటకాలను అందించడంపై దృష్టిపెట్టాలి
⦿ మన ఇంట్లో మనం తినే తిండి ఎంత శుచిగా ఉండాలనుకుంటామో, టాయిలెట్లు ఎంత పరిశుభ్రంగా ఉండాలనుకుంటామో… స్కూళ్లలో వండే ఆహారం అంతే నాణ్యతగా ఉండాలని, టాయిలెట్లు కూడా అంతే పరిశుభ్రతతో ఉండాలి
⦿ ప్రభుత్వ పాఠశాల అనేది అందరిదీ అనే భావన రావాలి
⦿ అంగన్‌వాడీలు, స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్‌ క్లినిక్స్‌ దృష్టిపెట్టాలి
⦿ ఎప్పటికప్పుడు వారికి పరీక్షలు నిర్వహించాలి
⦿ రక్తహీనత లాంటి సమస్యల నివారణకు ఇది ఉపయోగపడుతుంది
⦿ పీహెచ్‌సీ డాక్టర్లకు అనుసంధానం చేస్తే వారు తగిన చికిత్సను అందిస్తారు

Also Read : విద్యా పథకాలపై మంత్రి సురేష్ సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com