Tuesday, February 25, 2025
HomeTrending Newsబత్తలపల్లిలో జగన్ యాత్రకు పోటెత్తిన జనం

బత్తలపల్లిలో జగన్ యాత్రకు పోటెత్తిన జనం

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర  అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. గత రాత్రి బస చేసిన ప్రాంతం సంజీవపురం నుండి
రాఘవపల్లి క్రాస్ మీదుగా 11.20 గంటలకు బత్తలపల్లి చేరుకున్నారు. అశేష జన సందోహం జగన్ కు స్వాగతం పలికింది.  సుమారు 40 నిమిషాలు పాటు మధ్యాహ్నం 12 గంటల వరకు  అక్జకడే జనంతో మమేకం అయ్యారు.  రెండు చోట్ల భారీ గజమాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

రోడ్డుకు రెండువైపులా వేచిచూస్తున్న ప్రజలకు బస్సుపై నుంచి అభివాదం చేస్తూ… ప్రజల సమస్యలపై ఆరాతీస్తూ, అనారోగ్యం బారిన పడిన వారికి ఆసరాగా నిలుస్తూ… భరోసా ఇస్తూ  వారికి ధైర్యం ఇస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్