Saturday, June 6, 2026
Homeసినిమాహారర్ థ్రిల్లర్ లో పూజ హెగ్డే!

హారర్ థ్రిల్లర్ లో పూజ హెగ్డే!

పూజ హెగ్డే .. సన్నగా .. సన్నజాజిలా .. నాజూకుతనానికి నమూనాగా కనిపిస్తూ ఉంటుంది. తెలుగు .. తమిళ భాషలో స్టార్ హీరోయిన్ గా పూజ చక్రం తిప్పేసింది. ఇక బాలీవుడ్ కి కూడా తన గ్లామర్ ను పరిచయం చేసింది. ఒకానొక సమయంలో ఆమె చేతిలో అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే ఉన్నాయి. ఆ సమయంలో ఆమె దూకుడు ఇతర హీరోయిన్స్ కి నిద్రపట్టకుండా చేసింది. అదృష్టమంటే ఆమెదేనని అంతా అనుకున్నారు .. అసూయపడ్డారు కూడా.

అలా అందరూ అనుకునేలా చేసిన ఆ సినిమాల జాబితాలో రాధే శ్యామ్ .. బీస్ట్ .. ఆచార్య కనిపిస్తాయి. ఈ మూడూ భారీ సినిమాలే .. భారీ అంచనాల మధ్య విడుదలైనవే. అయితే ఈ సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయితే, ఆ ఎఫెక్ట్ ముందుగా హీరోయిన్ పైనే పడుతుంది. మౌనంగా వాళ్లు ఆ నిందను భరించవలసిందే. పూజ హెగ్డే విషయంలోను అదే జరిగింది. దాంతో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.

గత రెండేళ్లుగా పూజ హెగ్డే నుంచి తెలుగులో సినిమా లేదు. తెలుగులో ఆమె అంగీకరించిన ప్రాజెక్టులేమీ కనిపించడం లేదు. తమిళంలో మాత్రం ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆమె జోడీ కట్టే హీరో ఎవరో కాదు .. లారెన్స్.  అవును .. చాలా గ్యాప్ తరువాత ‘కాంచన 4’ చేయడానికి లారెన్స్ రంగంలోకి దిగాడు. ఇంతవరకూ హారర్ టచ్ తెలియని స్టార్ హీరోయిన్ కోసం ఆయన సెర్చ్ చేస్తున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆయన పూజ హెగ్డేను సంప్రదించడం .. ఆమె ఓకే అనడం జరిగిపోయాయని టాక్. అదే నిజమైతే .. పూజ కెరియర్ సౌత్ లో మళ్లీ గాడిలో పడుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular