Friday, March 29, 2024
Homeసినిమాప‌వ‌న్ స‌ర‌స‌న పూజా హేగ్డే

ప‌వ‌న్ స‌ర‌స‌న పూజా హేగ్డే

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందిన ‘గ‌బ్బ‌ర్ సింగ్’ ఎంత బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యిందో తెలిసిందే. వ‌ప‌న్ క‌ళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడాల‌నుకున్నారో అలా చూపించారు. అందుక‌నే ఆ సినిమా ఆ స్థాయిలో విజ‌యం సాధించింది. ‘గ‌బ్బ‌ర్ సింగ్’ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో మ‌ళ్లీ వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తే బాగుంటుంద‌ని అభిమానులు కోరుకున్నారు. నిర్మాత‌లు కూడా ఈ క్రేజీ కాంబినేష‌న్ సెట్ చేయాలి అనుకున్నారు.

ఇప్పుడు అనుకున్న‌ట్టుగానే ప‌వ‌న్ – హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ సెట్ అయ్యింది. ఈ క్రేజీ కాంబినేష‌న్లో మూవీకి ‘భవ‌దీయుడు భ‌గ‌త్ సింగ్’ టైటిల్ ఫిక్స్ అయ్యింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన‌ ఈ మూవీ టైటిల్ అండ్ ఫ‌స్ట్ లుక్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ప‌వ‌ర్ స్టార్ అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టించ‌నున్న‌ట్టుగా గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఈ వార్త‌ల పై డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ క్లారిటీ ఇచ్చారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ పూజా హేగ్డే గురించి మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్’ సినిమాలో పూజా హేగ్డే క‌థానాయిక అని అనౌన్స్ చేశారు. మ‌రి.. ఈసారి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భ‌వ‌దీయుడు భ‌గత్ సింగ్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్