Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్సౌతాఫ్రికా టూర్: రేహానే, పూజారాలకు చోటు

సౌతాఫ్రికా టూర్: రేహానే, పూజారాలకు చోటు

Team India for South Africa:
సౌతాఫ్రికాతో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నమూడు టెస్టుల సిరీస్ కు 18 మందితో కూడిన ఇండియా జట్టును బిసిసిఐ ప్రకటించింది. గాయం కారణంగా రవీంద్ర జడేజాతో పాటు శుభమన్ గిల్, అక్షర్ పటేల్, రాహుల్ చాహర్ లకు విశ్రాంతి ఇచ్చారు. అజింక్యా రెహానేతో పాటు చతేశ్వర్ పుజారాకు చోటు దక్కింది. ఇటీవలి కాలంలో తరచూ విఫలమవుతున్నఈ ఇద్దరు ఆటగాళ్లకు చోటు కల్పించడంపై గత కొంత కాలంగా జరుగుతోన్న ఊహాగానాలకు బిసిసిఐ తెరదించింది.

జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కే ఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రెహానే, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషభ్ పంత్, వృద్ధిమన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్

ఈ 18 మంది తో పాటు మరో నలుగురు ఆటగాళ్ళు నవదీప్ షైనీ, సౌరబ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నాగ్వ లను స్టాండ్ బై గా ఎంపిక చేసింది.

మరోవైపు టి 20 లతో పాటు వన్డేలకు కూడా విరాట్ స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్ గా బిసిసిఐ ఎంపిక చేసింది.

టెస్ట్ సిరీస్

2021, డిసెంబర్ 26 నుంచి 30  వరకు మొదటి టెస్ట్ – సెంచూరియన్

2022 జనవరి 3 నుంచి 7 వరకు రెండో టెస్ట్ – జోహేన్స్ బర్గ్

2022 జనవరి 11 నుంచి 15 వరకు మూడో రెండో టెస్ట్ – కేప్ టౌన్

టెస్ట్ సిరీస్

2022 జనవరి 19, 21,23 తేదీల్లో వరుసగా మూడు వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి.

వన్డే జట్టును త్వరలో ప్రకటించనున్నారు.

Also Read : యాషెస్ తొలిటెస్ట్: ఇంగ్లాండ్ 147 ఆలౌట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్