Friday, March 20, 2026
Homeస్పోర్ట్స్IPL Auction: కర్రన్, బ్రూక్స్ లకు భారీ ఆఫర్ - గుజరాత్ కు విలియమ్సన్

IPL Auction: కర్రన్, బ్రూక్స్ లకు భారీ ఆఫర్ – గుజరాత్ కు విలియమ్సన్

ఐపీఎల్ మినీ వేలం కొచ్చిలో ప్రారంభమైంది. శామ్ కర్రన్ ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటి వరకూ అత్యధిక రేటుకు అమ్ముడైన  ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. కాగా నేటి వేలంలో అత్యధిక రేటుకు అమ్ముడు బోయిన ఇద్దరు బ్యాట్స్ మెన్ ఇంగ్లాండ్ కు చెందిన వారే కావడం గమనార్హం. శామ్ కర్రన్ ను పంజాబ్ కింగ్స్ 18.50కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా, హ్యారీ బ్రూక్స్ ను  హైదరాబాద్ 13.25 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. మొన్నటి వరకూ పంజాబ్ కెప్టెన్ గా ఉన్న మయాంక్ అగర్వాల్ పై కూడా సన్ రైజర్స్ పెద్ద మొత్తం వెచ్చించి 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ వరకూ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్ ను గుజరాత్ జెయింట్స్ 2కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అజింక్యా రేహానేను చెన్నై సూపర్ కింగ్స్ 50లక్షలకు దక్కించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular