Friday, March 29, 2024
Homeసినిమాచిరుని పూరి ఈసారైనా మెప్పిస్తాడా..?

చిరుని పూరి ఈసారైనా మెప్పిస్తాడా..?

చిరంజీవి, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘ఆటోజానీ’ అనే సినిమా రూపొందనుందని వార్తలు రావడం.. ఆతర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం తెలిసిందే. ఆ స్టోరీ ఫస్ట్ ఆఫ్ నచ్చింది కానీ.. సెకండాఫ్ చిరంజీవికి నచ్చలేదట. అందుకనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండా కథాచర్చలతోనే ఆగిపోయింది. అయితే.. సెకండాఫ్ నచ్చలేదనే విషయం చిరంజీవి పూరికి చెప్పలేదు.. మీడియాకి చెప్పారు. చిరంజీవి అలా చేయడంతో పూరి బాగా ఫీలయ్యారు. సెకండాఫ్ నచ్చలేదనే విషయం తనకి చెబితే మార్పులు చేర్పులు చేస్తాను కానీ.. మీడియాకి చెప్పడం వలన ఏం లాభం అనేది పూరి వాదన.

ఇలా ఆటోజానీ ప్రాజెక్ట్ అటకెక్కింది. అప్పటి నుంచి పూరి వేరే సినిమాలతో బిజీ అయ్యారు కానీ.. చిరంజీవితో సినిమా గురించి పెద్దగా ఆలోచించలేదు. అయితే.. ‘గాడ్ ఫాదర్’ మూవీలో పూరి జగన్నాథ్ గెస్ట్ రోల్ చేశారు. ఈ క్యారెక్టర్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అప్పటి నుంచి చిరు, పూరి ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లోకి వచ్చింది.  ఇటీవల చిరంజీవిని పూరి జగన్నాథ్ ఇంటర్ వ్యూ చేశారు. గాడ్ ఫాదర్ సక్సెస్ నేపధ్యంలో పూరి ఇంటర్ వ్యూ చేసినప్పుడు చిరంజీవి స్వయంగా తనకు చెప్పిన స్టోరీ అలాగే వుంచావా..?  లేక చించేశావా..?  అని అడిగారు.

దానికి పూరి.. ఆ కథ పాతది అయిపోయింది. చించేశాను. మీ కోసం మరో స్టోరీ రాస్తున్నాను అని చెప్పారు. అప్పటి నుంచి చిరు, పూరి ప్రాజెక్ట్ గురించి మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చిరు కోసం పూరి పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశారని తెలిసింది. త్వరలోనే చిరంజీవికి పూరి కథ చెప్పనున్నారని సమాచారం. చిరంజీవి.. పూరితో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. సో.. ఈ ప్రాజెక్ట్ దాదాపుగా కన్ ఫర్మ్ అని టాక్ వినిపిస్తోంది. మరి.. ఈసారైనా పూరి.. చిరుని మెప్పించి.. అంచనాలకు తగ్గట్టుగా మంచి సినిమాని అందిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్