7.1 C
New York
Saturday, December 2, 2023

Buy now

Homeసినిమాపూరి తదుపరి ‘హీరో’ ఎవరు?

పూరి తదుపరి ‘హీరో’ ఎవరు?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ కరోనా కారణంగా ఆగింది. జులై నుంచి షూటింగ్ ప్రారంభించి త్వరగా పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ – అననన్య పాండే జంటగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లైగర్ ను పూరి, ఛార్మి, కరణ్‌ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత పూరి ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది.

ఆమధ్య పూరి చిరంజీవితో మూవీ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆతర్వాత బాలయ్యతో, నాగార్జునతో, వెంకటేష్ తో కూడా సినిమాలు చేసేందుకు పూరి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపించింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమా తీయనున్నారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో పూరి తదుపరి చిత్రం ఎవరితో అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. పూరి ప్రస్తుతం లైగర్ మూవీని కంప్లీట్ చేయడం గురించే ఆలోచిస్తున్నారట. లైగర్ పూర్తైన తర్వాత పూరి టాలీవుడ్ లో కాకండా.. బాలీవుడ్ లో మూవీ ప్లాన్ చేస్తున్నారని.. దీనికి కరణ్‌ జోహార్ నిర్మాత అని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్