Saturday, January 18, 2025
Homeసినిమాపుష్ప క్లైమాక్స్ గురించి పూరి కామెంట్స్..

పుష్ప క్లైమాక్స్ గురించి పూరి కామెంట్స్..

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ‘ఇస్మార్ట్ శంక‌ర్’ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చారు. ఈ మూవీ త‌ర్వాత పూరి తెర‌కెక్కించిన సినిమా ‘లైగ‌ర్’. సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన లైగ‌ర్ ఇండియాని షేక్ చేయ‌డం ఖాయం అనే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. అలాగే లైగ‌ర్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుంది అనేది కూడా ఇటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లో ఆస‌క్తిగా మారింది.

ఇదిలా ఉంటే.. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో పూరి జ‌గ‌న్నాథ్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇంత‌కీ ఏం చెప్పారంటే.. రోడ్డుపక్కన చాయ్ అమ్ముకునే ఒక తల్లి తన కొడుకును ఎలా చూడాలనుకుంది? అందు కోసం ఆ కొడుకు ఎంతగా కష్టపడ్డాడు ? అనేదే కథ. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ క్లైమాక్స్ గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు. అంత గొప్పగా దానిని డిజైన్ చేయడం జరిగింది అన్నారు.

ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాల్లో ‘పుష్ప’ క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది. హీరో, విలన్ ప్రశాంతంగా కూర్చుని కూల్ గా మాట్లాడుకోవడం నాకు కొత్తగా అనిపించింది.క్లైమాక్స్ కూడా అంతే కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందనే నమ్మకం నాకు ఉంది అన్నారు. దీంతో లైగ‌ర్ క్లైమాక్స్ పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. మ‌రి.. లైగ‌ర్ క్లైమాక్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read ‘పుష్ప 2’ ప్రారంభం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్