Friday, June 12, 2026
Homeసినిమా 'పుష్ప 2' ప్రారంభం

 ‘పుష్ప 2’ ప్రారంభం

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా,  350 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి అల్లు అర్జున్ కెరీర్ అతిపెద్ద విజయంగా నిలిచింది ఈ సినిమా. సినిమా కంటే కూడా పుష్ప మేనియా ప్రపంచాన్ని ఊపేసింది. అందులోని డైలాగులు, మేనరిజమ్స్ ,పాటలు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి.

ముఖ్యంగా అల్లు అర్జున్ నటనపై ప్రశంశల వర్షం కురిసింది. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా పుష్ప సంచలన విజయం సాధించింది. కరోనా సమయంలో కూడా 100 కోట్లకు పైగా వసూలు చేసి.. అల్లు అర్జున్ ను అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది.

ఇంతటి సంచలన విజయం సాధించిన ఈ సినిమా రెండో భాగం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. ఈ ఎదురు చూపులకు సమాధానం దొరికింది. తాజాగా పుష్ప సీక్వెల్ పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

Also Read : పుష్ప 2 టార్గెట్ ఏమిటి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular