మునుగోడులో బిజెపిని టిఆర్ఎస్ ఓడించగలుగుతుందని సిపిఐ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్ద శత్రువును కొట్టేందుకు చిన్న శత్రువును మునుగోడులో బలపరుస్తునమన్నారు. మునుగోడులో తెరాస -సిపిఐ పొత్తులపై ఈ రోజు మీడియాతో మాట్లాడిన సురవరం సుధాకర్ రెడ్డి వివిధ అంశాల్ని ప్రస్తావించారు.

కేసీఆర్ తో మాకు రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నాయని, కేసీఆర్ పైన మా పోరాటం ఆగదని సురవరం సుధాకర్ రెడ్డి వె;వెల్లడించారు. రైతు బంధు ఐదు,ఆరు ఎకరాల భూమి ఉన్న వాళ్లకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకంతో ఎంత లాభం జరిగిందని ప్రశ్నించారు. బిజెపి ఉచితాలు తీసేయాలి అంటూ ఒత్తిడి పెంచుతోందని, ప్రజా సంక్షేమం పూర్తిగా ఆపేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వేవేటికరణ ద్వారా వెనకబడిన వర్గాల రిజర్వేషన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రద్దు చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం విమర్శించారు.

Also Read మునుగోడులో తెరాసకు సిపిఐ మద్దతు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *