Wednesday, March 11, 2026
Homeసినిమాసల్మాన్, పూరి కాంబో సెట్ అయ్యిందా..?

సల్మాన్, పూరి కాంబో సెట్ అయ్యిందా..?

హీరో విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో విజయ్ తో మొదలు పెట్టిన ‘జనగణమన’ కూడా ఆగిపోయింది. ఇప్పుడు విజయ్ ఖుషి చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ నెక్ట్స్ మూవీ కోసం కథ రెడీ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పూరి తదుపరి చిత్రం  ఉండొచ్చని వార్తలు వచ్చాయి.  అయితే.. ఇప్పుడు చిరంజీవితో కాకుండా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో తాజాగా వినబడుతోంది.  సల్మాన్, పూరి ప్రాజెక్ట్ సెట్ కావడం వెనుక చిరంజీవి ఉన్నారని కూడా టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే…  పూరి కథని సల్మాన్ వద్దకు పంపించి ‘భాయ్ ఈ సినిమా నువ్వు హిందీ లో చేయ్..హిట్ తధ్యం’ అన్న ధీమాని వ్యక్తం చేసినట్లు టాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక పూరి ట్యాలెంట్ గురించి భాయ్ బాగా తెలుసు. పూరి గత హిట్ చిత్రాల్ని భాయ్ హిందీలో రీమేక్ చేసి సక్సెస్ లు అందుకున్నారు. ఆ రకంగా పూరి సత్తా ఏంటో సల్మాన్ అంచనా వేయగలడు. దీన్ని బట్టి  సల్మాన్ – పూరి కలయికలో మూవీ నిజమే అనిపిస్తుంది. అయితే.. ప్రచారంలో ఉన్నది నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular