Sunday, January 19, 2025
Homeసినిమాపూరీ జగన్నాథ్ కు మెగా ఛాన్స్

పూరీ జగన్నాథ్ కు మెగా ఛాన్స్

Entry as Actor: మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ (150వ సినిమా)కి  దర్శకత్వం వహించాలని పూరీ జగన్నాథ్ ఆశించారు. అయన చెప్పిన కథను సూత్రప్రాయంగా అంగీకరించిన చిరు దానిలో కొద్దిగా మార్పులు చేయాలని సూచించారు. అయితే ఆ తర్వాత ఏమైందో కానీ ఆ ఛాన్స్ వివి వినాయక్ కొట్టేశారు. తమిళ్ కత్తి సినిమాకు రీమేక్ గా ‘ఖైదీ నంబర్ 150’ గా రూపొందిన ఈ సినిమా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.  అయితే ఎప్పటికైనా చిరు సినిమాకు దర్శకత్వం వహించాలని అది తన జీవిత కాల కోరిక అని పూరీ జగన్నాథ్ పలుసార్లు చెప్పారు.

అయితే అయన దర్శకత్వం సంగతి అటుంచి చిరంజీవి నటిస్తున్న సినిమాలో ఓ పాత్ర పోషించే అవకాశాన్ని పూరీ దక్కించుకున్నాడు. మలయాళంలో మోహన్ లాన్ నటించి సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’…. తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పాత్ర నిడివి తక్కువే అయినా ప్రాధ్యాన్యం ఉన్న పాత్ర అని చెబుతున్నారు.

ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా తెలియజేస్తూ ట్విట్టర్ లో ఫోటో పోస్ట్ చేశారు. ‘హీరో అవుదామని ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ డైరెక్టర్ అయిన ఓ యువకుడి  కల కలగా మిగిలిపోకూడదు.. అందుకే గాడ్ ఫాదర్ లో ఆరంగ్రేటం చేయిస్తున్నాం’ అంటూ తెలిపారు. ఇప్పుడు ఈ ఫోటో తో పాటు చిరంజీవి, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ కలిసి దిగిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Also Read : గాడ్ ఫాద‌ర్ సెట్లోకి సల్మాన్ కు గ్రాండ్ వెల్ కమ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్