Saturday, January 18, 2025
Homeసినిమామళ్లీ రంగంలోకి దిగుతున్న పూరి!

మళ్లీ రంగంలోకి దిగుతున్న పూరి!

పూరి జగన్నాథ్ .. ఈ పేరు ఒక మార్క్ .. ఒక ట్రెండ్ అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఆయనకి  వరుస ఫ్లాపులు వచ్చినప్పటికీ, ఆయన క్రేజ్ ఎంత మాత్రం తగ్గక పోవడానికి కారణం, గతంలో ఆయన నుంచి వచ్చిన హిట్లే. దర్శకుడిగా .. రచయితగా ఆయన వేస్తూ వచ్చిన ముద్రనే. అలాంటి పూరికి ‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత హిట్ పడనే లేదు. అందువలన ఆయన నిర్మాతగా .. దర్శకుడిగా కూడా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అలాంటి ఒక హిట్ పడాలనే ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

పూరి నుంచి ఎన్నో అంచనాలతో వచ్చిన ‘లైగర్’ భారీ పరాజయాన్ని చవిచూసింది. ఆర్ధికంగా కూడా ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టింది. అయినా త్వరగానే కోలుకుని ఆయన ‘డబుల్ ఇస్మార్ట్’ చేశాడు. ఈ సీక్వెల్ పై ఆయనతో పాటు, అభిమానులు కూడా గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. ఈ సినిమా ఫలితం కూడా ఆయనను నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ఇక ఇప్పట్లో పూరి నుంచి సినిమా ఉండకపోవచ్చని చాలామంది భావించారు. పూరికి స్టార్ హీరోల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవచ్చని అనుకున్నారు.

కానీ ఇప్పుడు పూరి ఒక కథపై గట్టిగానే కసరత్తు చేస్తున్నాడనీ, త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. పూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరో ఎవరో కాదు ..  గోపీచంద్. రీసెంటుగా గోపీచంద్ కి పూరి ఒక లైన్ చెప్పాడనీ, అది వినగానే ఆయన ఓకే చెప్పాడని సమాచారం. పూరి స్టైల్లో .. గోపీచంద్ మార్క్ తో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనిలోనే పూరి ఉన్నాడట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్