Saturday, March 14, 2026
HomeసినిమాIsmart Combination: రామ్, పూరి మూవీకి ముహుర్తం ఫిక్స్!

Ismart Combination: రామ్, పూరి మూవీకి ముహుర్తం ఫిక్స్!

‘లైగర్’ డిజాస్టర్  తర్వాత  నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది పూరి జగన్నాథ్ ఇప్పటివరకు ప్రకటించలేదు. చిరంజీవి, బాలకృష్ణలతో పూరి సినిమా అంటూ ప్రచారం జరిగినా ఫైనల్ కాలేదు. ఇస్మార్ట్ హీరో రామ్ తో  సినిమా ఉంటుందని  తెలిసింది. పూరి ఫ్లాపుల్లో ఉన్నప్పుడు సినిమా చేయడానికి ముందుకు వచ్చింది రామ్. అదే.. ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా రామ్ ని మాస్ లోకి బాగా తీసుకెళ్లి ఇద్దరికీ బ్లాక్ బస్టర్ అందించింది. ఆ తర్వాత పూరి లైగర్ తీశాడు. భారీ డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ పూరితో సినిమా చేయడానికి ముందుకు వచ్చింది కూడా రామ్ కావడం విశేషం.

రామ్ ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్, పూరితో సినిమా చేయనున్నారని తెలిసింది.

అయితే ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చేస్తారా..? లేక వేరే కొత్త కథతో సినిమా చేస్తారా..? అనే డౌట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గానే ఉండబోతుందట.

ప్రస్తుతం ముంబాయిలో ఉన్న పూరి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి అక్కడే  ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని కూడా పూరి బ్యానర్ లోనే నిర్మించనున్నారు. అయితే.. ఈ చిత్రాన్ని రామ్ పుట్టినరోజైన మే 15న అనౌన్స్ చేయనున్నారు. ఆగష్టు నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular