Monday, June 8, 2026
Homeసినిమాడిసెంబర్ 3 ‘బ్యాక్ డోర్’ విడుదల

డిసెంబర్ 3 ‘బ్యాక్ డోర్’ విడుదల

Back Door on 3rd Dec :
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన క్రేజీ ఎంటర్టైనర్ ‘బ్యాక్ డోర్‘ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు “కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్” అధినేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత కందల కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు.

ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, ప్రముఖ నిర్మాత ఆచంట గోపినాధ్, రావణలంక కథానాయకుడు క్రిష్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

కృష్ణారెడ్డి మాట్లాడుతూ “బ్యాక్ డోర్ సినిమాకు ఉన్న క్రేజ్ కి తగ్గట్టు భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం హక్కుల కోసం పలువురు పోటీ పడినప్పటికీ… నా మీద నమ్మకముంచిన “బ్యాక్ డోర్” నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు కర్రి బాలాజీలకు థాంక్స్ తెలియజేస్తున్నాను. దర్శకుడిగా ఈ చిత్రం బాలాజీకి చాలా మంచి పేరు తీసుకురావడం ఖాయం” అన్నారు.

పూర్ణ నటించిన ‘బ్యాక్ డోర్’ ‘అఖండ’ ఒకేసారి విడుదలవుతుండడం నిర్మాతలకు కలిసివచ్చే అంశం. అలాగే “బ్యాక్ డోర్” చిత్రాన్ని విడుదల చేస్తున్న నెల్లూరు కృష్ణారెడ్డి బాలయ్యకు వీరాభిమాని

Also Read : బ్యాక్ డోర్ ట్రైలర్ కు భారీ స్పందన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular