Wednesday, June 17, 2026
HomeసినిమాPushpa 2: 'పుష్ప 2' గెటప్ వెనకున్న అసలు కథ ఇదేనా..?

Pushpa 2: ‘పుష్ప 2’ గెటప్ వెనకున్న అసలు కథ ఇదేనా..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు పుష్ప సినిమాకి సీక్వెల్ గా ‘పుష్ప 2’ వస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు.ఈ టీజర్ కు ట్రెమండస్ రెస్సాన్స్ వచ్చింది. అయితే.. అల్లు అర్జున్ ను ఊహించని గెటప్ లో కాళికాదేవి గెటప్ లో చూపించడంతో అసలు పుష్ప 2 లో ఏం చూపించబోతున్నారు..? ఏం చెప్పనున్నారు.. ? కాళికాదేవి గెటప్ లో అల్లు అర్జున్ ను ఎందుకు చూపించారు..? అనేది ఆసక్తిగా మారింది.

ఈ సినిమా క్లైమాక్స్ కి ముందు గంగమ్మ తల్లి జాతర నేపధ్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఈ గెటప్ లో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. దుష్ట సంహారం చేసే కాళిక అవతారంలో రౌడీలని పుష్పరాజ్ చంపడటం జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక పోస్టర్ ని సెలబ్రిటీలు కూడా ట్విట్టర్ లో షేర్ చేస్తూ బన్నీకి విషెస్ చెప్పారు. ఇదిలా ఉంటే ఈ గెటప్ వెనుక ఇంటరెస్టింగ్ కథ ఒకటి ఉందని తెలిసింది. ఏంటంటే… పూర్వకాలంలో తిరుపతి పరిసరాలలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఎక్కువగా జరిగేవట. అయితే.. పాలెగోండులు గ్రామాలలో ఆడవాళ్ళని బలవంతంగా ఎత్తుకుపోయి అత్యాచారం చేసే వారట.

దీంతో గ్రామస్తులు భగవంతుడిని ఆరాధిస్తే గంగమ్మ అవతరించిందట. ఆమె పెరిగి పెద్దయ్యాక పాలెగోండులు ఆమె మీద కన్నేస్తారని.. దీంతో రాక్షస సంహారం మొదలు పెడుతుందట. ఆమెకి భయపడి వారంతా అడవిలోకి పారిపోతారు. దీంతో వారిని బయటకి రప్పించడం కోసం మగాళ్ళు ఇలా విచిత్ర వేషధారణలో అడవులలోకి వెళ్లి  వారిని బయటకి తీసుకొచ్చేవారట. తరువాత గంగమ్మ వారిని సంహరించడంతో.. అప్పటి నుంచి ఆ గ్రామాలలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు తగ్గాయట. ఈ కథని తెలుసుకున్న సుకుమార్ అదే బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీలో ఒక యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసినట్లు వినిపిస్తుంది. మరి.. ఇదే నిజమైతే.. తెర పై బన్నీ పర్ ఫార్మెన్స్ అదరగొట్టేస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular