Saturday, June 13, 2026
Homeసినిమా'పుష్ప 2' నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడ?

‘పుష్ప 2’ నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో  రూపొందుతోన్న ‘పుష్ప 2‘ తాజా షెడ్యూల్ వైజాగ్ లో ముగిసింది. అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలతో పాటు ఇంట్రో సాంగ్ చిత్రీకరించారని సమాచారం. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని తెలియచేస్తూ.. బీచ్ లో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. సెకండ్ షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్ లో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  ‘రామోజీ  ఫిల్మ్ సిటీ’లో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. దీని కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఒక భారీ సెట్ వేశారట. మేజర్ పార్ట్ షూటింగ్ ఇక్కడ కొనసాగుతుందని అంటున్నారు.  కీలకమైన సన్నివేశాలను ఈ సెట్లో ప్లాన్ చేశారని చెబుతున్నారు.

క్రేజీ హీరోయిన్ రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా పహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తున్నారు. పుష్ప సినిమా సాధించిన విజయానికి రెట్టింపు విజయాన్ని పుష్ప 2 సాధిస్తుందని టాక్ వినిపిస్తోంది. విదేశాల్లో సైతం పుష్ప మానియా కనిపించింది. మరి.. పుష్ప రాజ్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular