Saturday, March 14, 2026
Homeసినిమా200 కోట్ల రూపాయల క్ల‌బ్ లో ‘పుష్ప’

200 కోట్ల రూపాయల క్ల‌బ్ లో ‘పుష్ప’

Pushpa- Rs. 200 Cr. club: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’ ఫ‌స్ట్ పార్ట్ డిసెంబ‌ర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌లైంది. అయితే.. ఈ సినిమాకి డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ వ‌ర్షం కురిపించింది. పుష్ప ది రైజ్ మూవీ మూడు రోజుల్లోనే  173 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో ఓవర్సీస్ లో కూడా రికార్డు క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం. ఫ‌స్ట్ వీక్ లో వ‌ర‌ల్డ్ వైడ్ గా పుష్ప 229 కోట్లు గ్రాస్ క‌లెక్ట్ చేసింద‌ని చిత్ర నిర్మాత‌లు అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా స్పెష‌ల్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు. 2021 లోనే బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక యు.ఎస్ లో 2 మిలియ‌న్ మార్క్ ను అందుకోవ‌డం మ‌రో విశేషం.

Also Read : బాలీవుడ్ లో.. దూసుకెళుతున్న పుష్ప‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular