డిసెంబర్ 8 నుండి రష్యాలో రిలీజ్ కానున్న ‘పుష్ప’

‘పుష్ప’ చిత్రం సృష్టించిన రికార్డ్ లు గురించి, పుష్పరాజ్ కి వచ్చిన అవార్డ్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తగ్గేదేలే అని ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ ఇప్పుడు నిజజీవితంలో కూడా వర్కౌట్ అవుతుంది. ఆ ఒక్క డైలాగ్ తో అటు క్రీడాకారులను, ఇటు రాజకీయనాయకులను ప్రభావితం చేసాడు పుష్పరాజ్. సినిమా వచ్చి దాదాపు సంవత్సం కావొస్తున్నా ఇంకా మన కళ్ళముందే తిరుగుతున్నాడు. సుకుమార్ రాసిన పాత్రలో బన్నీ ఒదిగిపోయి సినిమాలో సిండికేట్ వ్యవస్థను శాసించినట్లు, బయట సరికొత్త రికార్డ్స్ ను శాసిస్తున్నాడు.

పుష్ప సినిమా చిత్రాన్ని ఇప్పుడు రష్యా లో ప్రీమియర్స్ వేయనున్నారు. డిసెంబర్ 1 న మాస్కో లో ఈ చిత్రం ప్రీమియర్ వేయనున్నారు. డిసెంబర్ 3న పీటర్స్బర్గ్ లో ఈ చిత్రం ప్రీమియర్ వేయనున్నారు. ఈ ప్రీమియర్ షోస్ కి సినిమా కాస్ట్ & క్రూ కూడా హాజరు కానుంది. పుష్ప చిత్రం డిసెంబర్ 8 నుంచి రష్యాలో విడుదలకు సిద్దమవుతుంది. మరి.. పుష్ప రష్యాలో ఎంత వరకు ఆకట్టుకుంటుందో..? ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *