Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ పుష్ప. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక పుష్ఫ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉంటే.. సెట్స్ పై ఉన్న భారీ సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. మహేష్‌ సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి మూవీ, ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ.. సంక్రాంతికి వస్తున్నట్టు ప్రకటించడంతో పాటు రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశాయి.

అయితే.. పుష్ప సినిమా రిలీజ్ డేట్ ఇంకా రాలేదని అభిమానులు ఎదురు చూస్తుంటే.. ఈ రోజు పుష్ప మేకర్స్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. పుష్ప పార్ట్-1 చిత్రాన్ని 2021 క్రిస్మస్ కానుకగా విడుదల విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పుష్ప-ది రైజ్ పేరుతో మొదటి భాగం డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలోని ‘దాక్కో దాక్కో మేక’ అనే ఫస్ట్ సాంగ్ ను ఆగస్టు 13న విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com