Friday, March 29, 2024
Homeసినిమారామలక్ష్మికి ‘పుష్ప’ టీం గ్రాండ్ వెల్ కమ్

రామలక్ష్మికి ‘పుష్ప’ టీం గ్రాండ్ వెల్ కమ్

Pushpa Samantha Appearance In Special Song : 

ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా ‘పుష్ప’ రూపొందుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది.

వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక నవంబర్ 19న ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ సాగే నాలుగో సింగిల్‌ విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో స్టార్ హీరోయిన్ సమంత కాలు కదపనున్నారు. పుష్ప 5వ పాట మరింత స్పెషల్‌గా ఉండబోతుంది. సమంత ఎంట్రీతో ఆ పాట మరింత స్పెషల్ అయిపోయింది అంటూ చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేసారు. కెరీర్‌లో మొదటి సారి స‌మంత‌ స్పెషల్ సాంగ్ చేస్తుండ‌డం విశేషం.

సుకుమార్ రూపొందించిన ‘రంగస్థలం’ లో రామలక్ష్మి పాత్రలో సమంత ఒదిగిపోయింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంశలు దక్కాయి.  సుకుమార్ తాజా చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ లో నటిస్తుండడం విశేషం

Also Read :  ‘పుష్ప‌’లో స‌మంత‌ ఐటం సాంగ్?

RELATED ARTICLES

Most Popular

న్యూస్