Friday, March 13, 2026
Homeసినిమాడిసెంబర్ 6న ‘పుష్ప’ ట్రైలర్ విడుదల

డిసెంబర్ 6న ‘పుష్ప’ ట్రైలర్ విడుదల

Pushpa Trailer
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి మరో మేజర్ అప్‌డేట్ వచ్చింది. డిసెంబర్ 6న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలైంది. అందులో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా రూపొందుతోంది. రెండు భాగాలుగా వస్తున్నా ఈ సినిమా  మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఈ మూవీ టీజ‌ర్ తో సాంగ్స్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. మ‌రి.. ట్రైలర్ తో పుష్ప ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular