Saturday, January 18, 2025
Homeతెలంగాణపుట్టా శైలజ విచారణ

పుట్టా శైలజ విచారణ

పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు విచారణ రెండోరోజు కొనసాగుతోంది. రామగుండం కమిషనరేట్ లో మధును పోలీసులు విచారిస్తున్నారు. అయితే విచారణకు అయన సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. గత 10 రోజులుగా ఎక్కడెక్కడ తిరిగాననే విషయాన్ని మధు పోలీసులకు వివరించారు. మధుకు సన్నిహితంగా మెలిగే మంథని సిఐను బదిలీ చేశారు. మధు భార్య, మంథని మున్సిపల్ చైర్మన్ శైలజకు నోటిసులు సిఆర్పిసి 41 కింద నోటిసులు ఇచ్చిన పోలీసులు ఆమెను కూడా విచారిస్తున్నారు.

మధు అనుచరులను కూడా విచారించే ఆలోచనలో పోలీసులు వున్నారు. అడ్వకేట్ వామన్ రావు తండ్రి కిషన్ రావు రామగుండం కమిషనరేట్ కు వచ్చారు. తన కొడుకు, కోడలు హత్యకు సంబంధించి కొన్ని ఆధారాలను పోలీసులకు అందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్