Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్సెమీస్ లో సింధు

సెమీస్ లో సింధు

Sindhu into Semies:
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం  పి.వి. సింధు ఇండోనేషియా మాస్టర్స్ 2021 టోర్నీలో సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బాలిలోని బడుంగ్ రీజెన్సీలోని బాలి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్  లోని కోర్ట్ 3 లో జరిగిన మ్యాచ్ లో టర్కీ కి చెందిన నెష్లిహాన్ పై 21-13; 21-10 తేడాతో విజయం సాధించింది. 35 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్ లో మొదటినుంచీ సింధు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

కాసేపట్లో జరిగే మరో మ్యాచ్ లో జపాన్ కు చెందిన యమగుచి, థాయ్ లాండ్ చోచువోంగ్ లలో విజయం సాధించిన  వారితో సింధు సెమీ ఫైనల్లో తలపడనుంది.

Also Read : క్రికెట్ కు ఏబీ గుడ్ బై

RELATED ARTICLES

Most Popular

న్యూస్